Home తాజా వార్తలు హీరోగా సంగీత దర్శకుడు కోటి కొడుకు

హీరోగా సంగీత దర్శకుడు కోటి కొడుకు

Music Director Koti Son Act As Heroహైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కోటి కొడుకు రాజీవ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. కె.శివ వరప్రసాద్ దర్శకత్వంలో ఎం.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా ఇటీవల ప్రారంభమైంది. నవంబరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తామని దర్శకుడు శివ వరప్రసాద్ తెలిపారు. ఈ క్రమంలో సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో సంగీతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, కోటి సంగీతం అందించడం ఆనందంగా ఉందని నిర్మాత సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ సినిమాలో   ‘రంగస్థలం’ మహేశ్‌, రాకేందు మౌళి, ‘కంచెరపాలెం’ రాజు, టిఎన్‌ఆర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.