Home వార్తలు మ్యూజికల్ హారర్ ‘తులసీదళం’

మ్యూజికల్ హారర్ ‘తులసీదళం’

Tulasidalamనిశ్చల్, వందన గుప్తా జంటగా కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిషోర్ కంట మనేని సమర్పణలో ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘తులసీదళం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనె ల 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భం గా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, ఒరి స్సా, అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలలో రిలీజ్ చేస్తున్నాం. హార్రర్ సినిమా అంటే రాత్రిపూట ఎక్కువగా చిత్రీకరిస్తారు. కానీ మా చిత్రాన్ని ప్రపంచం లోకెల్ల అత్యధిక వెలుతురు గల ప్రాంతమైన లాస్ విల్లాస్‌లో షూట్ చేశాం. ఆ ప్రాంతంలో ఎప్పుడూ లైట్ ఉంటూనే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో అన్ని ఎమోషన్స్‌ను జోడించి చిత్రీకరించాం. తులసీదళం అంటే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల అనుకుంటున్నారు. కానీ మా సినిమా ఆ నవలతో పోల్చి చూడవద్దు. ప్రతి ప్రేమకు ఒక సమస్య ఉంటుంది. ఈ సినిమాలో ప్రేమ కథకు సమస్య హార్రర్. ఈ సినిమాకు దర్శకత్వం, మ్యూజిక్ అందించడంతో పాటు ముఖ్యమైన పాత్రలో కూడా నటించాను. ఆ పాత్ర కొత్తగా ఉంటుంది. ఇదొక మ్యూజికల్ ఫిల్మ్ అనవచ్చు. అన్ని మెలోడి సాంగ్స్ ఉంటాయి. బ్రహ్మానందం భూత వైద్యుడి పాత్రలో కనిపి స్తారు”అని అన్నారు. నిశ్చల్ మాట్లాడుతూ “45 రోజులు అందరం ఓ కుటుంబంలాగా కలిసి పనిచే శాం. సినిమా తప్పకుండా విజయవంత మవుతుం దన్న నమ్మకముంది”అని చెప్పారు. అచ్చిబాబు మాట్లాడుతూ “ఆర్.పి.పట్నాయక్‌తో కలిసి ఈ సినిమా చూడగానే మంచి కథ అనిపించింది. ఎలాగైనా సినిమాను రిలీజ్ చేయాలని ఆర్.పి.తో మాట్లాడాను. ఈ చిత్రాన్ని దాదాపు 200 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీపక్ రావెల్ల, అనితా చౌదరి, దువ్వాసి మోహన్ తదితరులు పాల్గొన్నారు.