Thursday, July 18, 2024

వాలెంటైన్స్ డే రోజున మ్యూజికల్ ప్రివ్యూ

- Advertisement -
- Advertisement -

LOVE STORY

 

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేమికుల రోజున మరో సర్‌ప్రైజ్‌తో రాబోతోంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా నుండి ఒక నిమిషం ‘మ్యూజికల్ ప్రివ్యూ’ను రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఈనెల 14న ఉదయం 11.07 గంటలకు సినిమాలోని మొదటి పాట ‘ఏయ్ పిల్లా’ అనే సాంగ్ ప్రివ్యూని విడుదల చేయనున్నారు.

ఏ.ఆర్.రెహమాన్ స్కూల్ నుండి పరిచయమవుతున్న పవన్ సి.హెచ్. అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని సినిమా టీమ్ చెబుతోంది. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమ కథ అక్కినేని అభిమానులు, ప్రేక్షకులను అమితాసక్తిని కలిగిస్తోంది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Musical preview on Valentine’s Day
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News