Tuesday, February 7, 2023

హెచ్‌సియులో ముస్లీంల ప్రవేశంపై నిషేధం!

- Advertisement -

HCUహైదరాబాద్ : వివాదాలకు కేంద్ర బిందువైన హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. యునివర్సిటీ క్యాంపస్‌లోకి ముస్లీంల ప్రవేశాన్ని యునివర్సిటి ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ టి.వి.రావు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ముస్లీం విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైయ్యారని, దీన్ని ఆపేందుకే వారిపై నిషేధం విధించినట్లు ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో క్యాంపస్‌లోకి ముస్లీంలు ప్రవేశిస్తున్నారని, వాళ్లు ఏదో సమస్యను సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అందుకే ముస్తీంలు క్యాంపస్‌లో ప్రవేశించకుండా తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles