Home జనగామ సూపర్ స్ప్రెడర్స్ విధిగా టీకాలు వేయించుకోవాలి : ఎర్రబెల్లి

సూపర్ స్ప్రెడర్స్ విధిగా టీకాలు వేయించుకోవాలి : ఎర్రబెల్లి

Must Be Given Vaccine To Superspreaders : Errabelliజనగామ : సూపర్ స్ప్రెడర్స్ విధిగా కరోనా టీకాలు వేయించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.  దేవరుప్పుల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సూపర్ స్ప్రెడర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాన్ని ఎర్రబెల్లి ప్రారంభించి మాట్లాడారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,03,000, మంది సూపర్ స్ప్రెడర్స్ ను గుర్తించామని మంత్రి  వెల్లడించారు. వీరికి ఉచితంగా టీకాలు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.  జనగామ జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 45 ఏళ్లు పైబడినవారికి 71 వేల 895 టీకాలు వేశామని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని మంత్రి తేల్చిచెప్పారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.