Friday, April 19, 2024

ఇండోనేషియాలో డి614జి వైరస్..

- Advertisement -
- Advertisement -

mutated Coronavirus strain found in Indonesia

జకర్తా: ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అల్లకల్లోలం అవుతుండగా, దీనికన్నా పది రెట్లు తీవ్రత కలిగిన పరివర్తనం చెందిన కరోనా వైరస్ ఇండోనేషియాలో ఇప్పుడు బయటపడింది. దీన్ని డి614జి వైరస్‌గా పిలుస్తున్నారు. ఇది ఇటీవలనే మలేసియాలో బయటపడింది. ఇండోనేషియాలో దీన్ని గుర్తించామని జకర్తా లోని ఐజక్‌మాన్ ఇనిస్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ బయోలజీ వివరించింది. జకర్తాలో ఇటీవల కేసులు పెరుగుతుండడానికి ఇది కారణమా కాదా అన్న కోణంలో మరింత పరిశోధన జరగవలసి ఉందని ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ హెరవాతీ సుడోయో వివరించారు. ఈ డి614జి వైరస్‌ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఫిబ్రవరి లోనే గుర్తించింది. అత్యంత వేగంగా వ్యాపించే గుణం దీనికి ఉన్నప్పటికీ ప్రాణాపాయం ఎక్కువగా ఉన్నట్టు స్పష్టం కాలేదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

mutated Coronavirus strain found in Indonesia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News