Home జాతీయ వార్తలు ఆ ఊరిలో మద్యం ముట్టుకుంటే…. 800 మందికి మటన్ కర్రీ పెట్టాల్సిందే

ఆ ఊరిలో మద్యం ముట్టుకుంటే…. 800 మందికి మటన్ కర్రీ పెట్టాల్సిందే

 

గాంధీనగర్: మద్యం పై వచ్చే డబ్బులతోనే తెలంగాణ ప్రభుత్వం పాలన సాగిస్తోందంటే… మన తెలంగాణలో మద్యం ప్రియులు ఎంత బాగా తాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్‌లోని ఖటిసితారా గ్రామాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆ గ్రామంలో మద్యం తాగితే 2 వేల రూపాయల జరిమానాతో పాటు మటన్ కూరతో ఎనిమిది వందల మంది గ్రామస్థులకు భోజనం పెట్టాలి. మద్యం తాగి వచ్చి అల్లరి చేస్తే అదనంగా 5 వేల రూపాయల జరిమానా గ్రామ పంచాయతీకి కట్టాలి. 2018లో ఓ వ్యక్తి మద్య సేవించి హంగామా చేయడంతో అతడికి 2 వేల రూపాయలతో పాటు అదనంగా 5 వేల రూపాయల జరిమానా విధించారు. మరుసటి రోజు ఎనిమిది వందల మంది గ్రామస్థులకు సరిపడ భోజనానికి మటన్ కర్రీతో పాటు గోదుమలతో తయారు చేసిన లడ్డూలను సదరు వ్యక్తి ఏర్పాటు చేశాడు. భోజనానికి 25 వేల రూపాయలు ఖర్చు చేశాడు. దీంతో గ్రామంలో మద్యం ముట్టుకోవాలంటే మద్యం ప్రియులు వణికిపోతున్నారు. బనస్ కాంతా జిల్లా అమిర్ ఘర్ తాలూకా ఖటిసితారా గ్రామంలో 2013-14 నుంచి మద్యాన్ని నిషేధించాలని గ్రామస్థులు తీర్మానం చేసుకున్నారు. మద్యం ప్రియులు తాగి వచ్చి అల్లరి చేస్తుండడంతో మద్యాన్ని నిషేధించినట్టు గ్రామ సర్పంచ్ ఖిమ్జీ దంగేషా తెలిపారు. 2019లో పక్కనున్న ఉప్పాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి తన గ్రామానికి వస్తే బయటకు పంపించామని సర్పంచ్ తెలిపారు. తన గ్రామంలో మద్యం నిషేధించినప్పటి నుంచి కేసులు, క్రైమ్ రేటు తగ్గిందని, గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని సర్పంచ్ వివరించాడు.

Muttor Party for Villagers about Drink Wine