Home తాజా వార్తలు రూ.25 లక్షల కోట్లకు మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు

రూ.25 లక్షల కోట్లకు మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు

Mutual fund assets worth Rs 25 lakh crore

న్యూఢిల్లీ: దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధి బాటలో పయనిస్తోంది. ఆగస్టు ముగింపు నాటికి మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ.25 లక్షల కోట్లకు చేరింది. అంతకు ముందు నెలతో పోలిస్తే దాదాపు 8.41 శాతం పెరుగుదల నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్లు లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయడమే ఇందుకు కారణం. ఎఎంఎఫ్‌ఐ సమాచారం ప్రకారం, 42 ఎంఎఫ్ సంస్థల ఆస్తులు జులై నెల ముగిసే సరికి రూ.23.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. అన్ని సంస్థల ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే గతేడాది ఆగస్టుకు ఇవి రూ.20.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే ఏడాదిలోనే రూ.5 లక్షల కోట్ల ఆస్తులు పెరిగాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్లకు విస్తృతంగా అవగాహన కల్పించడం, రిటైల్ ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా మదుపు చేయడంతో నెలవారీ వృద్ధి నమోదు అవుతోందని ఎఎంఎఫ్‌ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్‌ఎస్ వెంకటేశ్ తెలిపారు.