Home తాజా వార్తలు 9 నెలల్లో మ్యూచువల్ ఫండ్స్ రూ .9000 కోట్ల పెట్టుబడి

9 నెలల్లో మ్యూచువల్ ఫండ్స్ రూ .9000 కోట్ల పెట్టుబడి

Mutual Funds

 

న్యూఢిల్లీ: రీట్స్, ఇన్విట్స్ వంటి కొత్త పెట్టుబడి ఉత్పత్తుల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి -సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల్లో మ్యూచువల్ ఫండ్స్ సుమారు 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి. సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) గణాంకాల ప్రకారం, ఫండ్ మేనేజర్లు రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్)లో రూ.451 కోట్లు, ఇన్విట్స్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్)లో రూ.8,528 కోట్లు పెట్టుబడి పెట్టారు. మ్యూచువల్ ఫండ్స్ గత తొమ్మిది నెలల్లో ఈ పెట్టుబడి మార్గాల్లో తమ పెట్టుబడిని పెంచాయి. రీట్స్‌లో మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి జనవరిలో కేవలం రూ.7 కోట్లతో పోలిస్తే సెప్టెంబరులో రూ.69 కోట్లకు పెరిగింది. అదే సమయంలో ఇన్విట్స్ జనవరిలో రూ.611 కోట్ల పెట్టుబడి నుంచి రూ.1,034 కోట్లకు పెరిగింది. మంచి రాబడి ఉన్నందున పెట్టుబడిదారులకు రీట్స్ మంచి ఎంపిక అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Mutual Funds Invest Rs 9000 Crore During In 9 Months