Home తాజా వార్తలు బయటపడిన జలముత్యం

బయటపడిన జలముత్యం

Mutyala Jalapatham

మనతెలంగాణ/హైదరాబాద్: సమైక్య పాలనలో మరుగునపడ్డ తెలంగాణ అందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజా గా ముత్యాల జలపాతం భూపాలపల్లి జిల్లా లో ఒకటి తెరపైకి వచ్చింది. దేశంలోనే అద్భు త అందాలతో ప్రకృతి రమణీయతను ఒడిసిపట్టుకున్న ముత్యాల జలపాతం ఇప్పుడిప్పు డే బాహ్యప్రపంచానికి పరిచయం అవుతోం ది. మునీశ్వరులు తపస్సు చేసుకుంటుంటే, ముత్యాల్లా పడుతున్న నీటి జల్లుల పరవళ్ల కారణంగా దీనికి ముత్యాల జలపాతం అని పేరు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామానికి సమీపంలో, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ జలపాతం ఉంది. దండకారణ్యంలో ఉన్న ఈ జలపాతానికి ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచం నుంచి యువత వచ్చి చూస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.700 అడుగుల ఎత్తుపై నుంచి ముత్యాల్లా దుముకుతున్న జలధార సవ్వడులు వర్షాకాలంలో మొదలుకాగా, ఇప్పటి వరకు స్థానిక వీరభద్రవరం, వెంకటాపురం మండలం ప్రజలు మాత్రమే చూశారు.

రోడ్డు సౌకర్యం లేని కారణంగా ఇతర ప్రాంతాల ప్రజలు ఇన్ని రోజులు జలపాతం గురించి తెలియలేదు. కానీ తెలంగా ణ ఆవిర్భావం తర్వాత దీని గురించి ప్రచా రం జరుగుతుంది. రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఎక్కువ మంది పర్యాటకులు రావడంతో పా టు తెలంగాణ కీర్తికిరీటంలో ఈ జలపాతం చేరుతుందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ముత్యాల జలపాతం ఉంది. ఇందులో 145 కిలోమీటర్లు సులువుగా వెళ్లవచ్చు. ఆ తర్వా త ట్రాక్టర్, లేదా ద్విచక్ర వాహనం ద్వారా మాత్రమే 6 కి.మీ వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరో 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. దీనికి సమీపంలోనే మరో మూడు, నాలుగు జలపాతాలు కూడా ఉన్నాయి. అయితే ముత్యాల జలపాతం అన్నింటి కంటే కనువిందు చేస్తుందని స్థానికులు అంటున్నారు. దీనికి తోడు ఈ జలపాతానికి రావాలంటేనే అడ్వెంచర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి యువతే వస్తున్నారు.

Mutyala Jalapatham WaterFalls In Bhupalapally District