Thursday, April 25, 2024

కె.విశ్వనాథ్‌లాగా మంచి సినిమాలు తీయాలనేది నా కల

- Advertisement -
- Advertisement -

bharath bolloju

 

మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన భరత్ బొల్లోజుకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఎంతో ఆసక్తి. సినిమాల్లో నటించాలని, రచయితగా, డైరెక్టర్‌గా గొప్ప స్థానంలో ఉండాలని అతను కథలు రాయటం అలవర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో భరత్ బొల్లోజు కథలు, సాహిత్యాన్ని చూసి మెచ్చుకున్న గోరటి వెంకన్న అతన్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో అతను ఇప్పటివరకు 14 షార్ట్ ఫిలిమ్స్‌కు రచయిత, హీరో, డైరెక్టర్‌గా చేసి పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానల్ కోసం ఓ సీరియల్‌కు కథ రాస్తున్నాడు భరత్ బొల్లోజు.

అతని టాలెంట్‌కు గుర్తింపుగా పలు అవార్డులు కూడా భరత్‌కు దక్కాయి. అతను రచయితగా చేసిన ‘షీ’ అనే షార్ట్‌ఫిల్మ్, ఎన్టీఆర్ గురించి రాసిన ఆర్టికల్‌కుగాను గత ఏడాది ‘ఎన్టీఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డు’ అందుకున్నాడు. అదేవిధంగా గత ఏడాది గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ (అమెరికా) వారు భరత్‌కు నేషనల్ బెస్ట్ రైటర్ అవార్డును అందజేశారు. సినిమా రంగంలో రచయిత, దర్శకుడు, హీరోగా రాణించాలనేదే తన లక్ష్యమని చెప్పే భరత్ బొల్లోజుకు ఓ ప్రముఖ దర్శకనిర్మాత మంచి అవకాశాన్నిచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం అతను ఓ మంచి కథ రాస్తున్నాడు. భవిష్యత్తులో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌లాగా మంచి సినిమా లు తీయాలనేది తన కల అని భరత్ బొల్లోజు తెలిపాడు.

My dream is to make good films like K Viswanath
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News