Home ఆంధ్రప్రదేశ్ వార్తలు నా కుటుంబం రాజకీయాల్లోకి రాదు: వెంకయ్యనాయుడు

నా కుటుంబం రాజకీయాల్లోకి రాదు: వెంకయ్యనాయుడు

Venkaiah Naiduఅమరావతి: తన కుటుంబం రాజకీయాల్లోకి రాదని స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. శనివారం నెల్లూరులో నాలుగోరోజు పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు.. వెంకటాచలంలో వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్టాడారు. మాతృభాష పరిరక్షణకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఏం చేస్తామో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. ఇక నుంచి తాను ఐదు అంశాలపై దృష్టా సారిస్తానని చెప్పారు.

ఇకపై దేశవ్యాప్తంగా పర్యటించి యువకుల్లో స్ఫూర్తి నింపుతానని వెంకయ్య పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలు పరిశీలిస్తానన్నారు. దేశంలోని రైతులను కలుసుకుంటాననీ, భారతీయ సంస్కృతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతానని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రాబోరని వెంకయ్యనాయుడు తేల్చిచేప్పారు. వారంతా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, కలెక్టర్ ముత్యాలరాజుతో పాటు పలువురు, అధికారులు పాల్గొన్నారు.

My family does not come into politics says Venkaiah Naidu