Home తాజా వార్తలు జట్టు కోరుకున్నది ఇవ్వడమే నా పని: రోహిత్ శర్మ

జట్టు కోరుకున్నది ఇవ్వడమే నా పని: రోహిత్ శర్మ

Rohit-Sharmaవిశాఖపట్నం: తననుంచి జట్టు ఏదయితే కోరుకుంటుందో దాన్ని అందించడమే తన కర్తవ్యమని దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన రోహిత్ శర్మ అన్నాడు. ఓపెనర్‌గా రెండు ఇన్నింగ్స్‌లలోను సెంచరీలు చేయడం ద్వారా పలు రికార్డులు సృష్టించిన రోహిత్ మిడిలార్డర్‌లోనే కాదు ఓపెనర్‌గా కూడా తాను హిట్‌మ్యాన్‌నేనని నిరూపించాడు.

తాను ఏదో ఒక రోజు ఓపెనర్‌గా ఆడాల్సి వస్తుందని రెండేళ్ల క్రితమే టీమ్‌నుంచి తనకు సంకేతాలు వచ్చాయని, అందుకే నెట్స్‌లో కూడా తాను కొత్త బంతితో ప్రాక్టీస్ చేసే వాడినని, అందుకే ఇది తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఈ టెస్టులో మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్‌గా ఎన్నికయిన రోహిత్ అన్నాడు. అయితే ఇది తనకు గొప్ప అవకాశమని, ఈ అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాని రోహిత్ చెప్పాడు.

My Job Is To Play According to My Team Expectations