Wednesday, April 24, 2024

నా ఫోన్‌కూడా ట్యాప్ చేశారు

- Advertisement -
- Advertisement -
My Phone Is Definitely Tapped Says Rahul gandhi
ఇది రాజద్రోహమే: రాహుల్ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: ప్రజాసాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు.. దేశీయ వ్యక్తులు, సంస్థలపై పెగాసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది పూర్తిగా రాజద్రోహమేనని ఆయన దుయ్యబట్టారు. పెగాసస్ వ్యవహారంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. దీనికి బబాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘ పెగాసస్‌ను ఇజ్రాయెల్ ఆయుధంగా వర్గీకరించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దీన్ని ఉపయోగిస్తారని తెలిపింది. ప్రధాని మోడీ, హోంమంత్రి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఆయుధాన్ని దేశంలోని అన్ని సంస్థలపైనా ప్రయోగించారు. సిబిఐ డైరెక్టర్ ఫోన్‌పైనా నిఘా పెట్టారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఉపయోగించారు.

కర్నాటకలో ప్రభుత్వం కూల్చివేతకు పెగాసస్‌ను ఉపయోగించారు. నా ఫోన్‌నంబరు లక్షిత జాబితాలో ఉండడం కాదు.. నా మొబైల్‌ను కూడా ట్యాప్ చేశారు. ఇది కేవలం రాహుల్ గాంధీ ప్రైవసీకి సంబంధించిన విషయం కాదు. దేశ ప్రజల గొంతుకపై చేసిన దాడి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజద్రోహం’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెగాసస్ వ్యవహారంపై కేంద్రం సమాధానం చెప్పాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్నారు. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో తన ఆరోపణలపై ప్రధాని ఇదే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఆరోపణలు నిరాధారమని ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే వాస్తవం బైటికి వచ్చిందని రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాలపైనా రాహుల్ స్పందించారు. ప్రస్తుతం సమస్య సద్దుమణిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, పిసిసి అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ముఖాముఖి కలుసుకున్న కొద్ది సేపటికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దమ్ముంటే దర్యాప్తు చేసి ఫోన్ ఇవ్వాలి: బిజెపి

కాగా రాహుల్ గాంధీ ఆరోపణలపై బిజెపి స్పందిస్తూ, తన ఫోన్‌ను ట్రాప్ చేశారని రాహుల్ గాంధీ నమ్మితే దర్యాప్తు కోసం ఆయన తన ఫోన్‌ను అప్పగించాలని డిమాండ్ చేసింది. మోడీ ప్రభుత్వం అక్రమంగా ఎవరి ఫోన్‌నూ ట్రాప్ చేయలేదని బిజెపి అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ రాథోడ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News