Home తాజా వార్తలు ముఖేష్‌గౌడ్‌తో మైనంపల్లి భేటీ

ముఖేష్‌గౌడ్‌తో మైనంపల్లి భేటీ

Mynampally Meeting with Mukesh Goud

హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌తో గ్రేటర్ హైదరాబాద్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు ఆదివారం భేటీ అయ్యారు. ఎంజె మార్కెట్‌లోని తన నివాసంలో ముఖేష్‌గౌడ్ జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో మైనంపల్లి ముఖేష్ ఇంటికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖేష్‌గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనతో మైనంపల్లి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాను పార్టీ మారడం లేదని, హైదరాబాద్ పరిధిలోని ఆయా నియోజవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో భేటీ అయి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ముఖేష్‌గౌడ్ చెప్పారు.

Mynampally Meeting with Mukesh Goud