Wednesday, April 24, 2024

నోరు జారిన నిర్మలమ్మ.. వెంటనే సరిదిద్దుకుని సారీ చెప్పిన ఆర్థికమంత్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బడ్జెట్‌లోని ఏడు ప్రధానాంశాల్లో ఒకటైనగ్రీన్ గ్రోత్ విధానాన్ని ప్రస్తావించే సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొరబాటున నోరు జారి ఆ వెంటనే సారీ చెప్పారు. పాతబడిన పొల్యూటెడ్ వాహనాలను వెనక్కి తీసుకోవడమనే కీలక విధాన నిర్ణయం గురించి మాట్లాడుతూ రీప్లేసింగ్ పొల్యూటెడ్ వెహికిల్స్ అనడానికి బదులు ‘ రీప్లేసింగ్ ఓల్డ్ పొలిటికల్’ అనే పదం వాడారు.

అయితే ఆ వెంటనే మంత్రి తన పొరబాటును సరిదిద్దుకుంటూ ‘ఓ ..సారీ..’ అంటూ నవ్వేశారు. దీంతో ఒక్కసారిగా సభ నవ్వులతో మునిగిపోఇంది. 2021 22 బడ్జెట్‌లో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ గురించి ప్రస్తావించామని, కేంద్రప్రభుత్వ పాత వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు తగిన నిధులను కేటాయించామని ఆర్థిక మంత్రి చెప్పారు. రాష్ట్రాలు కూడా తమ పాత వాహనాలు, అంబులెన్స్‌లను వెనక్కి తీసుకోవడంతో సహకరించాలని నిర్మలా సీతారామన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News