Home తాజా వార్తలు కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ ట్రైలర్

కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ ట్రైలర్

Naa Nuvve Telugu Trailer out now

హైదరాబాద్: కళ్యాణ్ రామ్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నా నువ్వే’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, ఎమోషన్ కలయికగా సినిమా రూపొందినట్టు కనబడుతోంది. కళ్యాణ్ రామ్ ను డిఫరెంట్ లుక్ లో చూపించగా, తమన్నా మరింత గ్లామర్ గా కనిపిస్తోంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించడం అదనపు ఆకర్షణ. ఇక ఇటీవల వరుస ప్లాపులతో డీలాపడ్డా హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్ర విజయం ఎంతో ముఖ్యం. అలాగే  అవకాశాలు తగ్గిన తమన్నాకి కూడా మూవీ సక్సెస్ చాలా అవసరం. అన్నీ కార్యక్రమాలు ముగించుకొని త్వరలోనే ‘నా నువ్వే’  ప్రేక్షకుల ముందుకు రానుంది.