Thursday, April 18, 2024

ఫిబ్రవరి 19న ‘నాంది’

- Advertisement -
- Advertisement -

Naandhi movie release on Feb 19

 

కామెడీ చిత్రాలతో తనదైన శైలిలో నవ్వులు పంచిన హీరో అల్లరి నరేష్ తన పంథా మార్చుకొని వస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్‌లో 57వ చిత్రం. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ వస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘నాంది’ రిలీజ్ డేట్‌ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఫిల్మ్‌మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని వదిలారు. ఇందులో అల్లరి నరేష్ జైల్లో కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News