Home తాజా వార్తలు కారు కొనుక్కున్న ‘ఇస్మార్ట్’ పోరి…

కారు కొనుక్కున్న ‘ఇస్మార్ట్’ పోరి…

 

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నభా నటేష్… ‘ఇస్మార్ట్ శంకర్’తో కుర్రకారు మనస్సులను దోచుకుంది. ఈ మూవీలో పక్కా తెలంగాణ పోరిగా మాస్ క్యారెక్టర్ లో నటించి రచ్చ రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం నభా పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ భామకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడడంతో నిర్మాతలు ఎంత ఇవ్వడానికైన సిద్ధమవుతున్నారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలనుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా నభా, తనకిష్టమైన రెడ్ కలర్ మెర్సిడిస్ బెంజ్ కారును కొనుక్కుంది. ఆ కారు ముందు నిలబడి సెక్సీగా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా, వరుస ప్లాపులతో డీలాపడ్డ పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా భారీ విజయం సాధించడంతో ఆనందంలో మునిగిపోయాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి, సహా నిర్మాత ఛార్మీ ఇద్దరూ ఒకరికొకరు కార్లను బహుమతిగా ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

Nabha Natesh Gift herself Mercedes benz red car