Home జోగులాంబ గద్వాల్ వ్యవసాయరంగంలో నడిగడ్డను అభివృద్ధి చేస్తా: నిరంజన్

వ్యవసాయరంగంలో నడిగడ్డను అభివృద్ధి చేస్తా: నిరంజన్

ఎంపిడిఒ కార్యాలయం ప్రారంభం

 

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు వ్యవసాయపరంగా ఎంతొ అభివృద్ది చెందుతున్నాయని ఇంకా అభివృద్ది చెందడానికి తమ వంతు సహాయ సహాకారాలు అందిస్తానని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గద్వాల్ లో నూతనంగా నిర్మించిన ఎంపిడిఒ కార్యాలయంను ఆయన ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నడిగడ్డ ప్రాంతాలైన అలంపూర్, గద్వాల ప్రాంతాలలో వ్యవసాయపరంగా ఎంతో అభివృద్ది చెందుతున్నదని వైవిధ్యమైన పంటలు సాగుచేస్తు రైతన్నలు ముందుకు పోతారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనేక పథకాలు అమలుచేశారని ముఖ్యంగా సాగునీరు అందించేందుకు తుమ్మిళ్ల పథకం ను రూ. 783 కోట్ల నిధులతొ చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకం వల్ల 3 రిజర్వాయర్లు నింపి దాదాపు 80 వేల ఎకరాలు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు.

ఇంతే కాక గట్టు ఎత్తిపొతల పథకం ద్వారా దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతాయని దీంతొ గట్టులొ శాశ్వతంగా కరువు పారదొలి వలసలను నివారించొచ్చని సూచించారు. తనకు గద్వాల, అలంపూర్ అంటే అభిమానమని ఇక్కడ పండించే వంకాయలంటే తనకు ఇష్టమని తెలిపారు. ఏదైనా శుభకార్యాలు జరిగితే గద్వాలనుండి ప్రత్యేకంగా వంకాయలు తెప్పించుకుని వండే వారని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలొ పండించే పంటలకు దేశంలొనే మంచి గిరాకి ఉందన్నారు. భూమిని బట్టి పంటలు పండే విదంగా రైతుకు లాభసాటిగా చేసేందుకు వ్యవసాయశాఖ కృషి చేస్తుందని తెలిపారు. గతంలొ పాలించిన ప్రభుత్వాలు భవనాలను నాసిరకంగ నిర్మించారని దీంతొ ప్రాథమిక పాఠశాలలు కొన్ని శిథిలాస్థకుచేరాయని అన్నారు.

అదికారులు, ప్రజాప్రతినిదులు పర్యవేక్షణ ఉంటే భవనాలు గానీ ప్రభుత్వ ఆస్తులు గానీ సంరక్షించబడతాయని నూతన పంచాయతి రాజ్ చట్టంలొ మార్పులు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటే పదికాలాల పాటు సేవలందిస్తాయని ఈ భవనం ఇంత సుందరంగా నిర్మించారని ఈ భవనం పదేళ్లకైనా ఇలాగే ఉండేలా చూసుకునే బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతుబంధు రెండవ దశ కింద కొంత సాంకేతిక లొపాలున్నందున రైతుబందు డబ్బులు జమ కాలేదని త్వరలొ రైతుల ఖాతాలొ జమ అవుతాయని తెలిపారు. అలాగే సమగ్ర భూర్వే వల్ల అనేక ప్రభుత్వ భూములు గుర్తించబడ్డాయని ఇంకా రైతులకు మేలు జరిగిందని తెలిపారు.

గద్వాలలొ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుచేసేందుకు ముఖ్యమంత్రితొ మాట్లాడి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఇందుకు నివేదక ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలొ పాల్గొన్న జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతు జొగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ పరంగా ముందుకుపొతున్నదని ప్రభుత్వం సాగునీరు కల్పించి ఆదుకుంటున్నదని తెలిపారు. జిల్లాలొ రైతులకు ప్రభుత్వ పరంగా వచ్చే ఏ పథకమైనా అమలు చేయడానికి అధికారులు పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతు గతంలొ మంత్రిగా కొనసాగిన జూపల్లి కృష్ణారావు సహాయసహకారాలతొ ఎంపిడిఒ భవననిర్మాణం పూర్తి అయిందన్నారు. ఇంకా అభివృద్ది పనులకు నిరంజన్ రెడ్డి సహాయసహాకారులు కావాలని ఆయన కొరారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం మాట్లాడుతు నడిగడ్డలొ అలంపూర్ వెనుకబాటుకు గురైందని గత పాలకుల వల్ల ఏ అభివృద్ది జరగలేదన్నారు.

ప్రస్తుతం గద్వాల శరవేగంగా ముందుకుపొతున్నదని అలంపూర్ ను కూడా అభివృద్ది పర్చాలని మంత్రిని కొరారు. ఆర్డీఎస్ రైతులకు తుమ్మిళ్ల ఎత్తిపొతల పనులు పూర్తి చేసి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన కొరారు. కన్సూమర్ చైర్మెన్ గట్టుతిమ్మప్ప మాట్లాడుతు గతంలొ పరిపాలించిన ప్రభుత్వాలు అభివృద్దిని మరిచి స్వంత లాభాలు చూసుకున్నారని ప్రస్తుతం ముఖ్యమంత్రి హయాంలొ గ్రామాల అభివృద్ది జరుగుతు బంగారు తెలంగాణ రూపుదాల్చుకుంటుందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మెన్ బండారి బాస్కర్ మాట్లాడుతు 1952లొ నిర్మించిన గద్వాల ఎంపిడిఒ కార్యాలయంను ఇంతవరకు మరమ్మత్తులుచేసిన దాఖలాలు లేవని తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి ఆద్వర్యంలొ ప్రభుత్వ శాఖలకు స్వంతభవనాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయం ముందు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మరింత బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలొ మంత్రిని గజమాలతొ ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలొ ఎస్పీ కేపి లక్ష్మినాయక్, డిఏ ఒ గోవింద్‌నాయక్, ఎంపిపి సుభాన్, ఆర్డీఒ రాములు, తహశీల్దార్ జ్యొతి, నాగర్ దొడ్డి వెంకట్రాములు, పరుమాలనాగరాజు, లత్తిపురం వెంకట్రామిరె డ్డి, ఆయా మండలాల జడ్పిటిసి, ఎంపిపిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Nadigadda Developed in Agriculture Sector in Gadwal