Home తాజా వార్తలు శేఖర్‌ కమ్ముల-నాగచైతన్య కాంబోలో మూవీ…

శేఖర్‌ కమ్ముల-నాగచైతన్య కాంబోలో మూవీ…

 

హైదరాబాద్‌: ప్రముఖ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో ‘ఫిదా’ ఫేం మ‌ల‌యాళ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించనుంది. గురువారం సికింద్రాబాద్‌లోని గ‌ణ‌ప‌తి ఆల‌యంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మొదలైంది. సెప్టెంబ‌ర్ 1 నుండి చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ సినిమాకు నారాయణదాస్‌ నారంగ్‌, రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2019 చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 Naga chaitanya-Shekar kammula movie launched