Wednesday, April 24, 2024

ఆకట్టుకుంటున్న మెలోడి

- Advertisement -
- Advertisement -

Naga shaurya act in Lakshya movie
నాగశౌర్య హీరోగా కేతిక శర్మ హీరోయిన్‌గా స్పోర్ట్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయగా.. సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘సయ సయ’ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో నాగశౌర్య, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కృష్ణ కాంత్ మంచి సాహిత్యాన్ని అందించగా.. కాలభైరవ క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం శ్రావ్యంగా ఉంది. ఈ పాటలో నాగశౌర్య, కేతిక శర్మ జంట చూడముచ్చటగా ఉంది. ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పి.రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News