Thursday, March 28, 2024

వీడియో: రోడ్డుపై అమ్మాయిని కొట్టిన యువకుడు.. నిలదీసిన హీరో నాగ శౌర్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య తన కళ్ళ ముందు జరుగుతున్న ఒక సంఘటన నిలదీసి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కారులో వెళుతున్న నాగశౌర్యకు నడిరోడ్డు పై ఒక అబ్బాయి ఒక అమ్మాయి పై చెయ్యి చేసుకోవడం చూశాడు. వెంటనే కారు దిగి ఆమె పై ఎందుకు చెయ్యి చేసుకున్నావు అంటూ నిలదీశాడు. ఆమెకు క్షమాపణ చెప్పాలి అంటూ ఆ అబ్బాయిని కోరాడు. కానీ అతను మాత్రం క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. ఆమె నా లవర్ నా ఇష్టం అంటూ బదులివ్వడంతో నాగశౌర్య అతని చెయ్యి పట్టుకొని క్షమాపణ చెప్పే వరకు వదిలేదు లేదంటూ చెప్పాడు.
ఈ సంఘటనకి సంబంధించిన వీడియో బయటకి రావడంతో, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు మహిళల పట్ల నాగశౌర్య చూపించిన గౌరవ మర్యాదలకు హ్యాట్సాఫ్ అంటున్నారు.ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం రకరకాల పనులు చేస్తున్న తరుణంలో ఇది నిజామా? ప్రాంకా? అని కొందరు కన్‌ఫ్యుజ్ అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News