Home తాజా వార్తలు చైనా వస్తువులు, మొబైల్ యాప్స్‌ను బహిష్కరిద్దాం

చైనా వస్తువులు, మొబైల్ యాప్స్‌ను బహిష్కరిద్దాం

Nagababu tweets to ban Mobile Apps, China Phones

 

కరోనా వైరస్‌ను పుట్టించి ప్రపంచాన్ని దెబ్బతీయడంతో పాటు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి భారత్‌ను కలవరపెడుతున్న చైనాకు బుద్ది చెప్పాలనే డిమాండ్ దేశంలో పెరిగిపోతోంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో చైనా వస్తువులు, యాప్‌లు వాడొద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. చైనా వస్తువుల నుంచి సెల్ ఫోన్ల వరకు అన్నింటినీ బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే నినాదంతో మెగా బ్రదర్ నాగబాబు ముందుకొచ్చాడు. భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు వ్యతిరేకంగా ఆసక్తికర ట్వీట్లు చేశాడు. “మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా వస్తువులు, సెల్ ఫోన్లు, మొబైల్ యాప్స్‌ను బహిష్కరిద్దాం” అంటూ నాగబాబు పిలుపునిచ్చాడు.

మన దేశంలోనే తయారైన వస్తువులను కొందామని ఆయన పేర్కొన్నాడు. ప్రపంచంలోనే మనదేశం పెద్ద మార్కెట్ అని..అన్ని దేశాల వస్తువులను ఇక్కడ అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. మన దేశం డబ్బుతో బాగుపడి మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్న చైనా వాళ్లు ఉత్పత్తి చేసిన వస్తువులను బ్యాన్ చేద్దామని నాగబాబు పేర్కొన్నాడు. మన వస్తువులను కొంటే మన దేశంలోనే మన డబ్బు ఉంటుందని చెప్పాడు. అయితే నాగబాబు ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సపోర్టు చేయగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.