Home జాతీయ వార్తలు పోలింగ్ బూత్‌లో పేలిన బాంబు

పోలింగ్ బూత్‌లో పేలిన బాంబు

Nagaland-bomb-blast

కోహిమా: నాగాలాండ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టిజిట్ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 5.45 నిమిషాల ప్రాంతంలో నాటు బాంబు పేలింది. నాగాలాండ్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2156 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అందులో సగం బూత్‌లు ప్రమాదకరమే అని అధికారులు ముందే ఊహించి అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్  సాయంత్రం 4 వరకు జరుగుతుంది.