Home నాగర్ కర్నూల్ నాగం జనార్థన్‌రెడ్డి బిజెపికి రాంరాం

నాగం జనార్థన్‌రెడ్డి బిజెపికి రాంరాం

nagam

* కార్యకర్తల కోరిక మేరకు
బిజెపికి రాజీనామా
* ఏ పార్టీలో చేరినా
ప్రజలు, నాయకులు
నా వెంటే
* టిఆర్‌ఎస్ ప్రభుత్వం
చేసిందేమీలేదు
అప్పులు తప్పా
* ఏ ప్రభుత్వమైనా
అవినీతికి
పాల్పడితే
సహించేది
లేదు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ టౌన్ : 35 ఏళ్లుగా మచ్చలేని నాయకు నిగా నియోజవర్గానాకి సేవలు చేశానని, ప్రజలు నాకు కట్టిన పట్టంతో పలు సార్లు ఎంఎల్‌ఎగా, పలు మంత్రి పదవులు చేశానని,  పోరాడి సాధించుకున్న తెలంగాణ తర్వాత తెలంగాణ ఆత్మగౌరవ సభ సెంటిమెంట్‌తో  జూన్ 3,2013 న నిజాం మైదానంలో రాజ్‌నాథ్‌సింగ్ సమక్షం లో బిజెపి పార్టీలో చేరిన నేను రాష్ట్ర నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నా నని, టిఆర్‌ఎస్ ప్రభుతం చేస్తున్న పని తీరు, అవినీతి, కుంబకోణాలను ఎన్నోసార్లు బిజెపి ప్రభుత్వానికి తెలిపినా నాకు మద్దతు తెలపడం లేదని విసిగి పోయిన నేను  భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి తన స్వగృహంలో విలేకరుల, కార్యక ర్తల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చింది ప్రజల స్థితి గతులు పారుతాయని, అవినీతికి తావుండదని భావించామని , దానికి భిన్నంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు.  అది భరించలేకే కోట్ల రూపా యలు అప్పులు చేసి ఎవరికి దోచిపెడుతున్నారని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూం ఏవని, రైతులకు ఏం చేశారని, రైతుల రుణమాఫీ ఏమైందని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ, కాకతీయ, ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని అవినీతి మయం చేస్తున్నారని ఎన్నో సార్లు బిజెపి ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడమే కాకా కనీసం మద్దతు తెలపలేదన్నారు. గతంలో గాలి జనార్థన్‌రెడ్డి అవినీతిని బట్టబ యలు చేసిందే నేనే నని అన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఆందోళన చేపట్టాన న్నారు. టిడిపి రాజీనామా చేసిన కార్యకర్తలు, ముఖ్య నాయకులు తన వెంటే ఉన్నారన్నారు. ఇప్పుడు బిజెపి రాజీనామా చేసినా వారు ఒక్కరు కూడా పక్కకు పోలేదని అందరూ నా వెంటే ఉన్నారని వారి కోరిక మేర కు బిజెపి ప్రమరీ మెంబర్‌షిప్‌కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తు న్నామని దానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసి అమిత్‌షాకు మేయిల్ ద్వారా పంపుతామన్నారు. ఏపార్టీలో చేరే విషయంపై సమ యం తీసుకుని ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిష్టం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.  రాజీనామాల ను రాష్ట్ర బిజెపి యువన అధ్యక్షుడు నాగం శశిధర్‌రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోరచ అధ్యక్షుడు బాలగౌడ్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు కాశన్న తదిత రులు ఉన్నారు. కార్యక్రమంలో  వివిధ మండలాల ఎంపిటిసిలు, జడ్‌పి టిసిలు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.