Home తాజా వార్తలు ఖైరతాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య!

ఖైరతాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య!

murderహైదరాబాద్: నగరంలో వరస హత్యలు కలకలం రేపుతున్నాయి. శనివారం అర్థరాత్రి ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ దగ్గర కొందరు దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మృతుడిని బంగారయ్య (55)గా గుర్తించామని చెప్పారు. ఆయన స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామమని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Nagar Kurnool Person killed at Khairatabad Metro Pillar