Friday, March 29, 2024

ఫస్ట్ విజువల్‌తో థ్రిల్ చేయడానికి సిద్ధం

- Advertisement -
- Advertisement -

Nagarjuna's The Ghost Motion Poster Released

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా సినిమా మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ బ్లాక్‌ని త్వరలో షూట్ చేసి ప్రొడక్షన్ పార్ట్‌ని పూర్తి చేస్తారు. శనివారం విడుదల కానున్న ఫస్ట్ విజువల్‌తో ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి సిద్ధమైంది ఈ సినిమా. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘కిల్లింగ్ మెషీన్’ ప్రకటన పోస్టర్ చూస్తుంటే ఫస్ట్ విజువల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండబోతోందని అర్ధమవుతుంది. పోస్టర్‌లో నాగార్జున రెండు చేతులతో కత్తి పట్టుకొని టెర్రిఫిక్‌గా ఉన్నారు. ఫార్మల్ సూట్‌లో నాగార్జున కనిపిస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రుడు ఎరుపెక్కి వుండటం ఆసక్తికరంగా వుంది. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో నాగార్జున తొలిసారిగా ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు.

‘ది ఘోస్ట్’తో ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో వున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్‌తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nagarjuna’s The Ghost Motion Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News