Thursday, April 25, 2024

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఇళ్లు లేని నిరుపేదలు డబుల్ బెడ్ రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లకు స్థానికులు మాత్రమే అర్హులని, ఎక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అక్కడి నిరుపేదలు మాత్రమే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అచ్చంపేట మున్సిపాలిటీలో 150 డబుల్ బెడ్ రూం ఇళ్లు, కల్వకుర్తి మున్సిపాలిటీలో 240 ఇళ్లు, పెద్దముద్దునూర్‌లో 30 డబుల్ బెడ్ రూం ఇళ్లు వెరసి 420 ఇళ్లు నిరుపేద కుటుంబాలకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాబట్టి స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.

మార్చి 21వ తేది నుంచి మార్చి 27వ తేది వరకు మీ సేవా కేంద్రాల్లో తగిన ధృవీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, కుల ధృవీకరణ పత్రం, ఇటీవలి ఆదాయ ధృవ పత్రం, కుటుంబ సభ్యుల వివరాలతో మీసేవ కేంద్రంలో కేవలం 45 రూపాయలు మాత్రమే డాక్యుమెంటేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులను కానీ మరే ఇతర వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మార్చి 29వ తేదిన అధికారులు స్థానికంగా గ్రామ సభ నిర్వహించి నిబంధనలానుసారం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News