Saturday, April 20, 2024

ఒకే ఏడాది మూడు సినిమాలు

- Advertisement -
- Advertisement -

నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంటే ముందు ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ పూర్తిచేశాడు. అన్ని పనులు ముగించుకొని విడుదలకు సిద్ధమవుతుండగా కరోనా కేసులు పెరగడం, థియేటర్లు మూతబడటంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీంతో చైతన్య… విక్రమ్ కుమార్ సినిమాకు వెళ్లిపోయాడు. అన్ని సినిమాలు ఆగిపోయినా ‘థాంక్యూ’ షూటింగ్ మాత్రం విదేశాల్లో జరిగింది. ఈ రెండూ కాకుండా హిందీలో అమీర్ ఖాన్ చేస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తున్నాడు చైతన్య. లాక్‌డౌన్ ఆంక్షలు తొలిగాక ఈ సినిమా చిత్రీకరణ మొదలైతే అందులో చేరతాడు. ఈ మూడు సినిమాలు కూడ ఈ ఏడాదిలోనే విడుదల కావాలి. షూటింగ్స్ అనుకున్నట్టే జరిగితే చైతూ నుండి ఈ ఏడాది మూడు సినిమాలను చూడవచ్చు. ఒకవేళ అమీర్ ఖాన్ సినిమా ఆలస్యమైనా లవ్ స్టోరీ, థాంక్యూ సినిమాలు మాత్రం పక్కాగా రిలీజవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News