Tuesday, April 23, 2024

కార్మిక, ఉద్యమనేత నాయినికి కన్నీటి వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

 పాడెమోసిన మంత్రి కెటిఆర్
 అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రులు,
 నాయిని లోటు తీర్చలేనిది మంత్రి హరీష్ రావు
 తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న నేత నాయిని: ఎంఎల్‌సి కవిత
 కన్నీటి పర్యంతమైన నాయిని అభిమానులు

Naini funeral with government formalities

మనతెలంగాణ/హైదరాబాద్: కార్మిక ఉద్యమనేత, మాజీ మంత్రి నాయినినర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం వరకు ప్రదర్శనగా నాయిని అంతిమయాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. భౌతిక కాయానికి నాయిని నర్సింహారెడ్డి కొడుకు దేవేందర్ రెడ్డి అగ్గి పట్టుకుని ముందునడవగా దారిపొడుగున నాయిని భౌతిక కాయాన్ని మంత్రులు మోస్తూ స్మశాన వాటిక దగ్గరకు తీసుకు వచ్చారు. అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, నాయిని అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలమేరకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. నాయిని ఇకలేరు అని తెలుసుకున్న అనేకమంది అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు.
పాడెమోసిన కెటిఆర్
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గురువారం మధ్యాహ్నం నాయిని అంత్యక్రియలు జరిగాయి ఆత్మీయనేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు నాయకులు, అభిమానులు భారీఎత్తున వచ్చారు ప్రభుత్వం తరుపున అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, శ్రీనివాస్ గౌడ్ పాడె మోసి నివాళి అర్పించారు. రాష్ట్ర మంత్రులు,శాసనసభ్యులు, అభిమానులు ఈ అం త్యక్రియల్లో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.
నాయిని మృతి అత్యంతబాధాకరం
తెలంగాణ మాజీ మంత్రి, ఉద్యమకారుడు నాయిని నర్సింహారెడ్డి మరణం అత్యంత బాధాకరమని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీష్‌రావు విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో నాయిని చేసిన సేవలు గొప్పవని ఆయన గుర్తు చేశారు. కార్మికులు, పేదల పక్షపాతిగా వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్పవ్యక్తిత్వం నర్సన్నదన్నారు. వారు లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ నాయినికి నివాళులు అర్పించారు. నర్సన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని నర్సింహా రెడ్డి మృతి తీరనిలోటని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి నేటివరకు రాష్ట్రం కోసం అహర్నిషలు పాటుపడినవ్యక్తి అంటూ కవిత గుర్తు చేశారు. నర్సన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నాయిని కుటుంభసభ్యులు ధైర్యం కోల్పోవద్దని ఓదార్చారు. నాయిని నర్సింహారెడ్డి చేసిన ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్రసాధనకోసం తొలి, మళిదశలో చేసిన పోరాటాలను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ గుర్తు చేశారు. నాయిని నర్సింహారెడ్డికి నివాళులు అర్పించారు. నాయినినర్సింహారెడ్డి చేసిన పోరాటాలను శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. నాయిని మరణం తెలంగాణ ప్రజలకు తీరనిలోటు అని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్ర తొలి హోం మినిస్టర్‌గా పనిచేసి ఎన్నెసంస్కరణలు తీసుకు వచ్చారని ఆయన తెలిపారు. నాయిని ఆత్మకు శాంతి కలగాలని గుత్తా భగవంతున్ని ప్రార్థించారు. తెలంగాణ పోరాటయోధుడు నాయినినర్సింహారెడ్డి మృతిపట్ల శాసనసభ స్పీకర్ పోచారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కార్మిక నాయకుడిగా ఎన్నోపోరాటాలు చేసిన చరిత్ర నాయినికి ఉందన్నారు.

ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాయినికి నివాళులు అర్పించారు. కార్మిక పక్షపాతి, ప్రజల నేత, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కలిసి ఉద్యమించిన నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు అనేది జీర్ణించుకోలేక పోతున్నాని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ హోం శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలి,మలి విడత తెలంగాణ ఉద్యమంలో నాయిని క్రియాశీలక పాత్రను పోషించారని వినోద్ కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న తెలంగాణ పోరాట యోధుడు నాయిని నర్సింహారెడ్డి అని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హోంశాఖ మంత్రిగా నాయిని రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలందించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. నాయినికి ఆయన ఘన నివాళులు అర్పించారు.తెలంగాణకోసం ఉద్యమనేత కెసిఆర్ వెంట ఆందోళన బాటపట్టి రాష్ట్ర సాధన అనంతరం అత్యంత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నాయిని నిర్వహించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు.కార్మికుల అభ్యున్నతి సంక్షేమం కోసం నిలబడి అహర్నిషలు కృషిచేసిన గొప్పనాయకుడు నాయిని ఇకలేరని ఆయన విచారం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నాయిని మిగిలి పోయారని మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు చెప్పారు.

నాయిని నర్సింహా రెడ్డి మరణం పట్ల శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.టిఆర్‌ఎస్ పార్టీలో సుధీర్ఘకాలం పనిచేసిన నాయకుడు నాయినినర్సింహారెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతం నుంచి వచ్చి అంచెలంచలుగా ఎదిగిన నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి సతీమణి సునీతాతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు. ఉమ్మడి నల్గొండ నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అని గుర్తు చేస్తూ మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు అర్పించారు. తెలంగాణ తొలిమంత్రి వర్గంలో నాయినితో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి జగదీష్‌రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. నాయిని నర్సింహారెడ్డికి హైదరాబాద్‌కు విడదీయరాని అనుబంధం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేస్తూ నివాళులు అర్పించారు. కార్మికుల పక్షపాతిగా నిరంతంరం శ్రమించిన నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అని ఈటెల రాజెందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్తుచేశారు. నాయిని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అలాగే శాసనసభ్యుడు భాస్కర్ రావు, నల్గొండ జెడ్‌పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డితోపాటుగా పలువురు శాసనసభ్యులు నాయినినర్సింహారెడ్డికి ఘన నివాళి అర్పించి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు.

Naini funeral with government formalities

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News