Home తాజా వార్తలు 134 కిలోల గంజాయి పట్టివేత

134 కిలోల గంజాయి పట్టివేత

Nalabelli police seized of 134 kg cannabis

 

వరంగల్: నల్లబెల్లి మండలంలోని రామతీర్థం శివారు జాతీయ రహదారి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్ ఆటో నుంచి టాటా షిప్ట్ డిజైర్ కారుడలోకి అధిక మొత్తంలో ఎండు గంజాయి ప్యాకెట్లను మారుస్తు ఉండగా అనుమానిస్తూ ముగ్గురిని పట్టుకొని విచారించగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితులైన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారం శివారు నార్లవాగుతండాకు చెందిన భూక్య రాము, గూడూరుకు చెందిన ఎస్‌కే హనీఫ్(ఖలీల్), కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన కునుమల్ల సునీల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేశామని ఎస్సై బండారి వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం నిందితుల నుంచి 67 గంజాయి ప్యాకెట్లు 134 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుగ్గొండి సీఐ సతీష్‌బాబు ఆదేశాల మేరకు నిందితులను అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పర్చడం జరిగిందని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Nalabelli police seized of 134 kg cannabis