Home తాజా వార్తలు నామా బాటలో తెలుగు తమ్ముళ్లు

నామా బాటలో తెలుగు తమ్ముళ్లు

Nama Followersపార్టీ సభ్యత్వానికి సీనియర్ నాయకులు రాజీనామా
కెటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరెందుకు సన్నాహాలు
ఇల్లందు టౌన్‌ : టిఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు బాటలో నడిచేందుకు సిద్దంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ పట్టణ సీనియర్ నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, పెండికట్ల యాకయ్య, కావేటి రమేష్ యాదవ్‌లు స్పష్టం చేశారు. శుక్రవారం వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గడిచిన 37 ఏళ్లుగా టిడిపి బలోపేతానికి ఎంతగానో కృషి చేశామని ఆయన పేర్కొన్నారు. మారుతున్న రాజకీయ పరిస్ధితుల కారణంగా టిడిపికి  రాజీనామ చేయక తప్పడం లేదని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సిఎం కెసిఆర్ ప్రజల బాగు కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు వెల్లడించారు. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆధ్వర్యంలో 200 మందితో టిఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకోవాడానికి సన్నాహం చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.. అదే విధంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావును కెసిఆర్ ఎంపిక చేయడం హర్షనీయమని వారు తెలిపారు. భవిష్యత్ లో  టిఆర్ఎస్ బలోపేతానికి నామా నాగేశ్వరరావు నాయకత్వంలో స్ధానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా, ఇతర టిఆర్ఎస్ నేతలతో  కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు గోపగాని రాజు, కొండమల్ల కృష్ణ, దేశావత్ శ్రీహిరి, ఎస్‌కే సర్ధార్, లక్క ఉపేందర్, మందాటి శ్రీను, రాఘవపు రాకేష్, చీమల నగేష్, ఎమ్‌డి మసూర్, కొండూరి రాజీవ్, ఎస్‌కే మహముద్, దర్శనాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Nama Followers Join in TRS in Khammam