Friday, April 19, 2024

వీళ్లే నా జీవితం అంటున్న ఆ హీరోయిన్

- Advertisement -
- Advertisement -

Namrata

 

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు  భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నమ్రతకు తన భర్తైన మహేష్ బాబు, కొడుకు గౌతమ్ కృష్ణ, మామగారైన సూపర్ స్టార్ కృష్ణగారే బలమన్నారు. అంతేకాదు ఈ ముగ్గురుకి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ముగ్గురే నా జీవితంలో హీరోలు. వీరితో నా జీవితం పరిపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవం మరిచిపోలేనిదన్నారు. ప్రతి సారీ ఈ ముగ్గురు నాకు ఓ కొత్త విషయాన్ని నేర్పిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వీళ్లే.. నా బలం.. బలహీనత.. నా జీవితం అంటూ నమ్రత కాస్త ఎమోషనల్ అయింది. ఇప్పుడు ఈ ఫోటో చూసి మహేష్ బాబు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Namrata said These persons are my life
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News