Saturday, April 20, 2024

బాలకృష్ణకు సర్జరీ

- Advertisement -
- Advertisement -

Nandamuri Balakrishna underwent surgery

 

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణకు సర్జరీ జరిగింది. గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం అక్టోబరు 31వ తేదీన బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి వెళ్లారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్‌రెడ్డి, డాక్టర్ బి.ఎన్.ప్రసాద్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా బాలకృష్ణకు సర్జరీ చేశారు. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని ఆయనకు డాక్టర్లు చెప్పారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ‘అఖండ’ రిలీజ్‌కు రెడీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు. బాలయ్య తన నెక్స్ మూవీని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ఆరు వారాల పాటు విశ్రాంతి అనంతరం ఈ సీనియర్ స్టార్ తన నెక్స్ మూవీని చేస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News