Home తాజా వార్తలు బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ…

బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ…

Nandamuri-Vasundhara-Devi

పంజగుట్ట: నటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అ రెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో నందమూరీ బాలకృష్ణ నివాసం ఉంటున్నారు.కాగా బంజారాహిల్స్‌లోని హేచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉంది. తానకు ఖతా ను సులువుగా నిర్వహించుకునేందుకుగాను అన్‌లై న్ బ్యాంకింగ్ కోసం ధరఖాస్తు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులనుంచి సంక్షిప్త సమాచారం అందింది.

దీంతో వసుంధర తాను ఎలాంటి ధరఖాస్తు చేసుకోలేదని బ్యాంకు మేనేజర్‌కు వివరించింది. దింతో వసుంధ ర వ్యక్తిగత సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పో లీసులు దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో నందమూరి బాలకృష్ణ కార్యాలయంలో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కొర్రిశివ ఉద్దేశ్య పూర్వకంగానే వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. నిందితుడిపై 467,468,471,420 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Nandamuri Balakrishna Wife Signature Forgery