Home సినిమా ‘ఎంఎల్ఎ’ ఫస్ట్ లుక్ విడుదల!

‘ఎంఎల్ఎ’ ఫస్ట్ లుక్ విడుదల!

Kalyan-Ram-MLA-1

హైదరాబాద్ : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎంఎల్ఎ). ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మంగళవారం విడుదల చేశారు. హీరో కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ని చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత కాజల్, కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్ బ్యానర్ పై, విశ్వ ప్రసాద్, భరత్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.