Home తాజా వార్తలు నేడు మేడారం 3,4 పంపుల వెట్ రన్…

నేడు మేడారం 3,4 పంపుల వెట్ రన్…

wet run

 

ఇప్పటికే జలధరించిన మొదటి రెండు పంపులు
తొలకరికి ముందే వెట్ రన్ పూర్తి
పంపులు సిద్ధం

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారం పంపుహౌజ్‌లో పంపులకు నేడు వెట్ రన్ చేయనున్నారు. ఏప్రిల్ 24వ తేదీన మేడారంలో మొదటి పంపుకు జరిపిన వెట్న్ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో 25వ తేదీన రెండో పంపుకు సైతం వెట్న్‌న్రు విజయవంతంగా నిర్వహించారు. బు ధవారం మధ్యాహ్నం 12 4.4 మెగావాట్ల సామ ర్థం ఉన్న మూడవ పంపుకు వెట్న్ జరుపుతారు. ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన నీటితో నంది మేడారం సర్జ్‌పూల్ (ప్యాకేజీ 6)కు జలకళ వచ్చింది.

పంపులు నడిపించాలంటే సర్జ్‌పూల్‌లో నీటిమట్టం 138 మీటర్లు ఉండాలి. కానీ అంతకు మించిన నీటిమట్టాన్నే సర్జ్‌పూల్‌లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏడు పంపులు ఏర్పాటు చేయగా, ఒక్కో మోటారుకు 124.4 మెగావాట్ల సామర్థం ఉంది. ఆసియాలోనే అతి పెద్ద మోటార్లను కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగిస్తుండడంతో వీటికి బాహుబలి మోటార్లు అని పిలుస్తున్నారు. ప్యాకేజీ 8లో 139 మెగావాట్ల సామర్థంతో అతి పెద్ద పంపులు ఏర్పాటు చేస్తుండగా, రెండో స్థానంలో మేడారం పంపులు ఉన్నాయి. మూడో పంపును మధ్యాహ్నం స్విచ్ ఆన్ చేసి, ప్రారంభించి, సుమారుగా అరగంట పాటు ప్రయోగాత్మకంగా నడుపుతారు.

దీంతో వచ్చిన నీరంతా మేడారం రిజర్వాయర్లోకి చేరుతుంది. సాంకేతిక పరిశీలన తర్వాత సమస్యలేవి లేకుండా వెట్న్ విజయవంతం అయిందని అధికారులు ప్రకటిస్తారు. అనంతరం వీలును బట్టి వెట్న్‌క్రు సిద్ధంగా ఉన్న నాలుగో పంపును సైతం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు వీలుగా సర్జ్‌పూల్‌లో రెండు డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లను తెరిచిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ వెట్న్ కోసం అధికారుల బృందం, ఏజెన్సీలు నిరంతరం శ్రమిస్తున్నాయి. కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, ఏఈఈలు ఉపేందర్, శ్రీనివాస్, రాకేష్, డీజీఎం శ్రీనివాసరావు, డీపీఎం శ్రీనివాస్ తదితరులు గత పది రోజులుగా 6వ ప్యాకేజీ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Nandhi Madam Pump house is pumped to wet run