Thursday, March 28, 2024

ఈ విజయానికి 8 ఏళ్లు పట్టింది

- Advertisement -
- Advertisement -

నాందితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం విజయంవంతగా రన్ అవుతోంది. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది సక్సెస్ మీట్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకులు గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, నిర్మాతలు కేఎస్ రామారావు, అనిల్ సుంకర, హీరో సందీప్ కిషన్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ… 2012 తర్వాత నన్ను హిట్స్ పలకరించడం మానేశాయి. ఈసారి మనదే అని ప్రతీసారి అనుకుంటున్నాను. కానీ 2021 మాత్రం ఈసారి మనదే అయ్యింది. మహర్షి తర్వాత కంగారు పడి సినిమా చేయకూడదు కంటెంట్‌తో చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. దర్శకుడు విజయ్ వచ్చి కథ చెప్పినప్పుడు పోలీస్, లాయర్‌ల గురించి అన్ని విషయాలు రీసెర్చ్ చేసి చేయాలని అతనికి చెప్పాను. విజయ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

ఇకా సతీష్ నిర్మాతగా ధైర్యం చేశారు. కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో ప్రయోగాత్మక సినిమా ఏంటి అనుకోకుండా నాతో కొత్త తరహా సినిమా ప్రయత్నించారు. ఇకపైనా ఇలాంటి డిఫరెంట్ సినిమాలే ఆయన చేయాలని కోరుతున్నా. నేను కూడా ఈ విజయాన్ని కొనసాగించేలా సినిమాలు ఎంచుకుంటాను అని అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ… నరేష్‌కి కథ చెప్పిన వెంటనే షూటింగ్‌కు సిద్ధం అయ్యారు. సినిమాలో ఆర్టిస్ట్‌లు అంతా బాగా నటించారు. మా ఇంటి పేరు నిలబెడుతూ కనకమేడ లాంటి హిట్ ఇచ్చారు. అని తెలిపారు. నిర్మాత సతీష్ మాట్లాడుతూ… విడుదలయిన అన్ని చోట్ల నాంది చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. హైదారాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇలా ప్రతి చోటు నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవి ప్రసాద్, రమేష్ రెడ్డి, నటుడు చక్రపాణి, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, అబ్బూరి రవి, స్టోరీ రైటర్ తూము వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, ప్రియదర్శి తదతకులు పాల్గొన్నారు.

Nandi Movie Success Meet Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News