Home మినీ సంగ్రామం నంద్యాల ఉప ఎన్నిక : ఏర్పాట్లు పూర్తి

నంద్యాల ఉప ఎన్నిక : ఏర్పాట్లు పూర్తి

Nandyala-By-Poll

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని అన్ని కేంద్రాలకు ఇసి పోలింగ్ సామగ్రిని తరలించింది. పోలింగ్ సిబ్బంది సహా ఆరు వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఇసి అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 144 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా, 71 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా ఇసి గుర్తించింది. నియోజకవర్గం మొత్తం సమస్యాత్మకంగా ఉండడంతో ఇసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పారా మిలటరీ బలగాలకు అప్పగించారు. ఇప్పటికే 6 కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు నంద్యాలకు చేరుకున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్‌క్యాస్టింగ్ సిబ్బంది సహా మొత్తం పది మంది విధులు నిర్వహించనున్నారు. సోమవారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మంగళవారం అధికార టిడిపి, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపిలు ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వైఎస్‌ఆర్‌సిపి ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ఇసికి పలుమార్లు ఫిర్యాదు చేసింది. వైఎస్‌ఆర్‌సిపిపై కూడా అధికార టిడిపి ఇసికి ఫిర్యాదు చేసింది. ఈ ఉప ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నంద్యాలలో కాసింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

Nandyal by elections : Completion of Arrangements