Thursday, April 25, 2024

నాని, సాయిపల్లవి కాంబినేషన్ లో మరో చిత్రం?

- Advertisement -
- Advertisement -

Nani and Sai Pallavi

‘ఎంసిఎ’ సినిమాలో హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి కలిసి చేసిన మ్యాజిక్ ఇప్పటికీ గుర్తుండి పోతుంది ప్రేక్షకులకు. మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి అవకాశం కనిపిస్తోంది. నాని సరసన మరోసారి సాయిపల్లవిని హీరోయిన్‌గా నటింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘లవ్ స్టోరీ’ సినిమాలో చైతన్య సరసన నటిస్తోంది సాయి పల్లవి. అలాగే రానాతో ‘విరాటపర్వం’ సినిమా నిర్మాణ దశలో వుంది. ఇప్పుడు ముచ్చటగా సాయిపల్లవి తెలుగులో మరో సినిమా ఓకె చేయబోతున్నట్లు తెలిసింది.

నాని త్వరలో చేయబోయే ‘శ్యామ్ సింగరాయ్’లో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈమేరకు సాయి పల్లవికి కథ చెప్పి ఓకె చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు ఫిల్మ్‌మేకర్స్. సాధారణంగా వెరైటీ కథలు, హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు అంటే సాయి పల్లవి నో అనదు. ఆ లెక్కన ఆమె ‘శ్యామ్ సింగరాయ్’కి ఓకె అంటుందనే అనుకోవాలి. ఆ విధంగా మళ్లీ మరోసారి నాని, సాయిపల్లవిల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించనుందని చెప్పాలి.

Nani and Sai Pallavi Combination repeat again!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News