Thursday, April 25, 2024

‘మీట్ క్యూట్’ షురూ

- Advertisement -
- Advertisement -

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను స్థాపించిన నేచురల్ స్టార్ నాని… ‘అ!’, ‘హిట్’ వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు రూపొందించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఇటీవలే ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ గా ‘హిట్ 2’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా తన ప్రొడక్షన్‌లో నాలుగవ సినిమాని ప్రకటించారు. నిర్మాత తిపిర్నేని ప్రశాంతితో కలిసి ‘మీట్ క్యూట్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు నాని. ఈ సినిమా ఒక కంటెంట్ డ్రివెన్ ఉమెన్ సెంట్రిక్ మూవీ అని తెలిసింది. ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి ప్రతిభావంతులైన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని.. ఈ సినిమాతో దీప్తి ఘంట అనే లేడీ డైరెక్టర్‌ను పరిచయం చేస్తున్నాడు.

ప్రముఖ కథానాయికలు లీడ్ రోల్‌లో నటించనున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. హైదరాబాద్‌లో సోమవారం ‘మీట్ క్యూట్’ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశం కోసం సత్యరాజ్‌పై నాని స్వయంగా క్లాప్ కొట్టారు. ‘మీట్ క్యూట్’ చిత్రానికి వసంత కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణం, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Nani to produce ‘Meet Cute’ movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News