Home తాజా వార్తలు కొత్త ట్రెండ్‌ని సృష్టించే ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’

కొత్త ట్రెండ్‌ని సృష్టించే ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’

Nani's Gangleader

 

నేచురల్ స్టార్ నాని, వర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించిన ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలచేసిన ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ “శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.

తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. ఫ్యామిలీ, యూత్ అందరూ చూడదగ్గ చిత్రమిది. నానితో ‘కృష్ణగాడివీరప్రేమగాథ’ నుండే ఒక సినిమా చేద్దామని అనుకున్నాం. మూడు సంవత్సరాల తర్వాత ’గ్యాంగ్‌లీడర్’ కుదిరింది. మా బ్యానర్‌లో బ్రహ్మాండమైన సినిమా తీసిన దర్శకుడు విక్రమ్‌కి థాంక్స్. అలాగే ప్రియాంక, కార్తీక్‌తో పాటు మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు”అని అన్నారు. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ “ముందుగా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న నానికి థాంక్స్. మైత్రి వారు బెస్ట్ ప్రొడ్యూసర్స్. వారు ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు. వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. కార్తికేయ రోల్ చాలా బాగుంటుంది. అలాగే ప్రియాంక వండర్‌ఫుల్ పర్‌ఫార్మర్. అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు”అని తెలిపారు.

నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “సినిమా అవుట్‌పుట్‌తో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో ప్రేక్షకుల నవ్వులు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఎటువంటి సమస్య లేకుండా ఈ సినిమా పూర్తయింది అంటే దానికి కారణం మైత్రి టీమ్. విక్రమ్ కెరీర్‌లో ఇది ఫాస్టెస్ట్ ఫిలిం. ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. కార్తికేయ బిజీగా ఉండి కూడా కథ నచ్చి ఈ సినిమా చేశాడు.

ఈ సినిమాలో కొత్త కార్తికేయను చూడబోతున్నారు”అని చెప్పారు. నటుడు కార్తికేయ మాట్లాడుతూ “కథ వినగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలాగే ఈ సినిమాలో విక్రమ్, నాని ఉన్నారని ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాను. ఈ మూవీ ఇంకో 10, 15 సంవత్సరాల వరకూ ఒక కొత్త ట్రెండ్‌ని, కొత్త జోనర్‌ని సృష్టించి చాలా సినిమాలకు రిఫరెన్స్‌లా ఉంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక, మైత్రి మూవీ మేకర్స్ సిఇఒ చిరంజీవి(చెర్రీ) పాల్గొన్నారు.

Nani’s Gangleader movie Releas Tomorrow