Tuesday, April 23, 2024

‘జెర్సీ’ మూవీకి జాతీయ అవార్డు..

- Advertisement -
- Advertisement -

నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. 2019 సంవ‌త్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ మూవీ అవార్డు గెలుచుకుంది. తాజాగా కేంద్ర ‌ప్ర‌భుత్వం ప్రకటించిన 67వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌ల్లో జెర్సీ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంతోపాటు బెస్ట్ ఎడిటింగ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అలాగే, మహేష్ బాబు నటించిన ‘మ‌హ‌ర్షి’ చిత్రంలోని ఓ పాటకు బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డును అందుకుంది. ఇక, అసురన్ సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా తమిళ స్టార్ హీరో దనుష్ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ నటిగా కంగనా రనౌత్ కు జాతీయ అవార్డు వరించింది. దీంతోపాటు ఉత్తమ తమిళ చిత్రంగా అసురన్, ఉత్త‌మ హిందీ చిత్రంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చిచోరే నిలిచాయి.

Nani’s ‘Jersey’ Movie won two National Awards

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News