Saturday, March 2, 2024

నాని ‘శ్యామ్ సింఘ‌రాయ్’ మూవీ లాంఛ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం న‌టిస్తోన్న సినిమా ‘శ్యామ్ సింఘ‌రాయ్’‌. ఈ మూవీ గురువారం హైద‌రాబాద్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రంలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని, కృతిశెట్టి, సాయిప‌ల్ల‌విపై ముహూర్త‌పు స‌న్నివేశానికి నాని తండ్రి ఘంటా రాంబాబు క్లాప్ కొట్టారు. యంగ్ డైరెక్టర్ మేర్ల‌పాక గాంధీ కెమెరా స్విఛాన్ చేయ‌గా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డైరెక్టర్లు శివ‌నిర్వాణ‌, వెంకీ కుడుముల స్క్రిప్ట్ ను నిర్మాత‌కు అంద‌జేశారు. ‘ట్యాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకీర్త్య‌న్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ ఎస్ బోయిన‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Nani’s Shyam Singha Roy Movie Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News