Home చిన్న సినిమాలు ‘టక్ జగదీష్’ టీజర్ విడుదల..

‘టక్ జగదీష్’ టీజర్ విడుదల..

Nani's Tuck Jagadish Teaser released

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. ‘నిన్నుకోరి’ ఫేం డైరెక్టర్ శివ నిర్వాణ మరోసారి నానితో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ టీజర్ విడుదల అయ్యింది. సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ టీజర్ ను నాని అభిమానులతో పంచుకున్నాడు. టీజర్ ను చూస్తుంటే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనింగ్ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఎప్రిల్ 23న విడుదల కానుంది.

Nani’s Tuck Jagadish Teaser released