నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి ప్రముఖ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ మూవీలో నాని విలన్ పాత్రలో నటిస్తుండగా, సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో నాని, సుధీర్ బాబుల యాక్షన్స్ సీన్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సర్… అప్పుడప్పుడు నాలాంటోడు గుడ్డిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటారంతే’ అని సుధీర్ బాబు చెప్పిన డైలాగ్, ‘న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటానికి నువ్వు వస్తున్నావ్ అనగానే విజిల్స్ వేయడానికి నేనేమీ నీ ఫ్యాన్‌ని కాదురా.. సోది ఆపు దమ్ముంటే నన్ను ఆపు’ అని నాని చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nani’s V Movie teaser released