ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతూ సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్‌గా సుధీర్‌బాబు నటించగా… అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ సభా నటేశ్ కనిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా సిద్ధమవుతున్న ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి వినాయక చవితి పర్వదినాన సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 12న స్పెషల్ ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు. నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, జీవా, వర్షిణి, సౌందర రాజన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ః సురేష్ రగుతు, మ్యూజిక్ః అజనీష్ బి.లోకనాథ్, ఎడిటర్ః ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి.