Friday, April 19, 2024

తెలుగు రాష్ట్రాలకు నారాయణ విద్యాసంస్థల భారీ విరాళం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిద్-19 మహమ్మారి ఇప్పుడు భారత్‌లోనూ రోజురోజుకు ఉధృతిని పెంచుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోనూ వేగంగా విస్తరిస్తూ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ ప్రమాదకర వైరస్‌ను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థలు తమ వంతు సాయంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకు ముందడుగు వేసింది. రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. తెలుగు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 కోటి ఇప్పటికే అందించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 కోటి అతి త్వరలో అందించనున్నట్లు నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.పునీత్ తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ మాట్లాడుతూ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ తమ వంతుగా స్వీయ నిర్భందం పాటిస్తూ లాక్‌డౌన్‌ను విజయవంతంగ చేయాలని కోరారు. ప్రజలు విపత్తు నుంచి బయటపడేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలుపాటించాలని అభ్యర్థించారు. అత్యవసరమైనా కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. గంటకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థగా పేరుగాంచిన నారాయణ మొదటి నుంచి ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా, అత్యవసర పరిస్థితులు తలెత్తినా ప్రజలకు సహాయం అందించడం కోసం ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటూ ఉదారంగా పెద్ద మొత్తంలో సహాయం అందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటోంది.

Narayana Institutions Donates Rs 2 Cr to AP and TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News