Home రాష్ట్ర వార్తలు నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల కోసం ప్రజాఉద్యమం 

నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల కోసం ప్రజాఉద్యమం 

JALASADANA-SAMITHI-ROUND-TAహైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టుల అంశంలో ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహారిస్తోందని పలువురు వక్తలు మండిపడ్డారు. ‘నారాయణపేట-కొడం గల్ ఎత్తిపోతలప్రాజెక్ట్’ను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అం దుకు తక్షణమే ప్రత్యేక్ష పోరుకు కార్యాచరణను రూపొందించాలని పిలుపునిచ్చారు. వినతులను, విజ్ఞప్తులను పట్టించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రాజెక్టులను సాధించుకోవాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పాదయాత్రలు, ధర్నాలు, వివిధ దశలలో ఆందోళనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ప్రాజె క్ట్ సాధన దిశగా జల సాధన సమితి చేపట్టే ప్రతి కార్యక్రమానికి రాజకీయ పార్టీలు, టి జెఎసి, రైతు సంఘాలు సంఘీభావం వ్యక్తం చేయడంతో పాటు ఆందోళన కార్యక్రమాల్లో ప్రత్యెక్షంగా పాల్గొంటామని భరోసనిచ్చాయి. జలసాధన సమితి ఆధ్వర్యంలో హైదరా బాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం “నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ -జలసాధన” పై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, టిజెఎసి ఛైర్మ న్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ, నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్, బిజెపి నాయకులు, మాజీ మంత్రి నాగంజనార్దన్ రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే కొత్తకో ట దయాకర్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం జెఎసి ఛైర్మన్ జస్టిస్ చంద్ర కుమా ర్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగా రావు, తెలంగాణ రైతు సంఘం నాయకులు చంద్రారెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు లక్ష్మికాంత్, టి జెఎసి నాయకులు వెంకట్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలతో పాటు జలసాధన సమితి అధ్యక్షులు అనంత్ రెడ్డి, కన్వీనర్ నర్సిం హరెడ్డి పాల్గొన్నారు.
అవినీతి కోసమే ప్రాజెక్టుల రీ డిజైనింగ్- జైపాల్ రెడ్డి
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజాస్వామిక వ్యక్తిత్వం లేదని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆరోపించారు. అవినీతి కోసమే నీటి పారుదల ప్రాజెక్టులకు రీ డిజైన్ చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే తప్పిం చుకునే పరిస్థితులు లేవన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును టిఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టించలేదని, ఇది కాంగ్రెస్ హయంలోనిదేనని వివరించారు. ఉద్యమాల ద్వారానే “నారాయణ పేట-కోడంగల్(భీమా) ఎత్తిపోతల ప్రాజెక్ట్ అమలు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పారు. నికర జలాలతో నారాయణ ఖేడ్, కోడంగల్, మక్తల్ నియోజకవర్గ పరిధిలో సాగునీరు అందుతుందని, త ద్వారా ఇక్కడి పొలాలు సాగులోకి వస్తాయని వివరించారు. టిఆర్‌ఎస్‌లో చేరి న ఇద్దరు ఎమ్మెల్యేలు భీమా ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను అమలు చేసేలా ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకువస్తే వారికి పార్టీ ఫిరాయింపుల నుంచి క్షమాబిక్ష పెడ తామని వ్యాఖ్యానించారు. సిఎం కెసిఆర్ నడవడిక తనకు ఏమాత్రం అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు.
పాత డిజైన్ ప్రకారమే :ప్రొ.కోదండరామ్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే అమలు చేయాలని టిజెఎసి ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ డిమాండ్ చేశారు. జూరాల నుంచి నీరు తీసుకునేలా రూపొందించిన పాత డిజైన్‌ను అమలు చేయడం ద్వారా పడమటి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని పరిగి, వికా రాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా నీరు అందుతుందని వివరించారు. బీమా ప్రాజెక్ట్‌ను అమలు చేసేందుకు టిజెఎసి పక్షాన తమ వంతు ప్రయత్నిస్తామని, దీనికి జెజెఎసి సమగ్ర కార్యచరణతో ముందుకెళ్తుందని చెప్పారు. పాలమూ రు అత్యంత వెనుకబడిన జిల్లా అని అందుకే ఇక్కడి సాగునీటి కల్పనపై లో తుగా అధ్యయనం జరగాలని, ప్రణాళికలపై చర్చ అవసరమని చెప్పారు. ఈ జిల్లాలో ప్రాజెక్ట్ అంశాలతో పాటు విద్య, వైద్యం, తదితర అభివృద్ధి పనులపై జెఎసి ఆలోచిస్తోందని వివరించారు. సమిష్టి పోరాటాలతోనే ప్రాజెక్టులను సా ధించిన చరిత్ర మనదరు.
మిషన్ భగీరథలో అవినీతి-నాగం జనార్దన్ రెడ్డి
నీటిపారుదల ప్రాజెక్టులలో అవినీతి విపరీతంగా పెరుగుతుంనది, ఇక్కడి కాం ట్రాక్టులను ఆంధ్రావారికి అప్పగిస్తోందని బిజెపి నేత డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లో కూడా అవినీతి పెరిగిందని, ఈ విషయాన్ని అందరికీ వివరిస్తామని, ప్రతిపక్షాలు కలిసి దీనిపై పోరాటం చే యాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరు చూస్తూంటే ఆంధ్రా సిఎంగా వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి- తమ్మినేని
బీమా ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యచరణను రూపొందించాలని సిపిఐ(ఎం) కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం అన్నారు. క్షేత్ర స్థాయి నుంచే మహాధర్నాను నిర్వహించాలని, దీనికి సాధా రణ ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజలతో పాద యాత్ర నిర్వహించాలన్నారు. దీనికి అనుగుణంగానే తక్షణమే కార్యచరణను రూపొందించి వెంటనే అమలు చేయాలని, ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని ఆయన చెప్పారు.
ప్రాజెక్టుల్లో అవినీతి- జస్టిస్ చంద్రకుమార్
ప్రాజెక్టుల్లో అవినీతి పారుతోందని జస్టిస్ చంద్రకమార్ వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పక్షపాతం, వివక్షత లేకుండా పాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాభిష్టం మేరకే పనులు జరగాలని, ప్రాజెక్టులకు డిజైన్స్ మారిస్తే అవి ప్రజాలకు అనుకూలంగా ఉన్నాయా..? లేదా? అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
నిరంకుశ పాలన -డి.కె.అరుణ
రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ఆరోపించారు. పాలమూరు జిల్లాను మరోసారి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు అంచనా వ్యయం బాగా పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పాలమూరుపై ప్రేమలేదన్నారు. ప్రాజెక్టులను వివాదస్పదం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.